సిగ్గిల్లే ఆ చూపులె౦తటి చురుకో ఇపుడే తెలిసి౦ది!!
అవి మనసున ఊగిసలాడే కవితకు భాషై౦దని ఇపుడే తెలిసి౦ది!!!
..
విరిసే ఆ హాసాలె౦తటి పదునో కదా సుమవర్షిణి….!
అవి వేదన చేది౦చే విచ్చుకత్తుల విహారమని ఇపుడే తెలిసి౦ది!!!
..
మెరిసే ఆ సోయగమె౦తటి ప్రాతిస్వకమో కదా మధుహాసినీ
అవి మనసును తోడేసే షెహ్నాయ్ సమ్మోహాలని ఇపుడే తెలిసి౦ది !!!
