గగనవీధి నేలుతున్న..మహిమాన్విత మా జెండా..!
గగనవీధి నేలుతున్న..మహిమాన్విత మా జెండా..!గురు శక్తిని వర్షించే..తత్వవిదిత మా జెండా..! ముచ్చటైన మువ్వన్నెల..పరమార్థం మనోహరం..అన్నపూర్ణ హాసాద్భుత..నిత్యహరిత మా జెండా..! స్వచ్ఛతకే పుట్టినిల్లు..మెఱుపులకే శోభనింపు..శ్వేతపూర్ణ అమాయికత..వర్ణాంకిత మా జెండా..!.
