September 18, 2026
శ్రీ. మాధవరావు కొరుప్రోల

శ్రీ. మాధవరావు కొరుప్రోల

మాధవ గజల్ డా.మాధవరావు కొరుప్రోలు ఎం.ఏ. తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయం Poets కవి పరిచయం పేరు : మాధవరావు కొరుప్రోలుశ్రీమతి పేరు : ఆండాళ్లుతండ్రి పేరు : వెంకటేశ్వరరావుతల్లి పేరు : రంగనాయకమ్మఉద్యోగం : విశ్రాంత కాలేజీ ఇంజనీర్, మిథ్రదాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్.పుట్టిన ఊరు : చెరువు మాధవరం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రంచదువు : ఎం.ఏ. తెలుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాధవ గజల్ డా.మాధవరావు కొరుప్రోలు ప్రధాన పుస్తకాలు నిశ్శబ్ద నాట్యం (కవితా సంపుటి)

Read More
శ్రీ. మాధవరావు కొరుప్రోల

గగనవీధి నేలుతున్న..మహిమాన్విత మా జెండా..!

గగనవీధి నేలుతున్న..మహిమాన్విత మా జెండా..!గురు శక్తిని వర్షించే..తత్వవిదిత మా జెండా..! ముచ్చటైన మువ్వన్నెల..పరమార్థం మనోహరం..అన్నపూర్ణ హాసాద్భుత..నిత్యహరిత మా జెండా..! స్వచ్ఛతకే పుట్టినిల్లు..మెఱుపులకే శోభనింపు..శ్వేతపూర్ణ అమాయికత..వర్ణాంకిత మా జెండా..! ఊపిరులకు ఊపిరయే..త్యాగోదయ కాషాయం..విశ్వమైత్రి సాధనలో..సంయోగిత మా జెండా..! సమరవాంఛ చల్లార్చే..ధర్మచక్ర ధారిణిరో..సప్తచక్ర సంచారీ..ధ్యానసహిత మా జెండా..! తెలుగుదనం పూరించిన..ఒక పింగళి చైతన్యం..సామరస్య సౌమనస్య..సంశోభిత మా జెండా..! నిజమాధవ గీతామృత..ప్రబోధాగ్ని సాక్షి తనే..కరుణపూర్ణ కమలాలయ..తేజకలిత మా జెండా..!

Read More
డా. సి. నారాయణ రెడ్డి

సిగ్గిల్లే ఆ చూపులె౦తటి చురుకో ఇపుడే తెలిసి౦ది!!

సిగ్గిల్లే ఆ చూపులె౦తటి చురుకో ఇపుడే తెలిసి౦ది!! అవి మనసున ఊగిసలాడే కవితకు భాషై౦దని ఇపుడే తెలిసి౦ది!!! .. విరిసే ఆ హాసాలె౦తటి పదునో కదా సుమవర్షిణి….! అవి వేదన చేది౦చే విచ్చుకత్తుల విహారమని ఇపుడే తెలిసి౦ది!!! .. మెరిసే ఆ సోయగమె౦తటి ప్రాతిస్వకమో కదా మధుహాసినీ అవి మనసును తోడేసే షెహ్నాయ్ సమ్మోహాలని ఇపుడే తెలిసి౦ది !!!

Read More
శ్రీ కొత్తగూడెం రాజేష్

భ్రమరాలను చూడననే పూలతోట ఏమిటో!

భ్రమరాలను చూడననే పూలతోట ఏమిటో! సుమగంధం మోయననే గాలి ఆట ఏమిటో!! గమ్యమిదని చెప్పలేక బాట మూగబోయినా గమనం గమ్యం చేసే పక్షిపాట ఏమిటో!! నినుమరిచానని చెప్పు నోటిమాట నిజమైతే నిన్ను మరువలేనను కన్నీటి వూట ఏమిటో!! ఎదురైనను చూడనట్లు తప్పించుకు తిరిగేవు నలుగురిలో ననువెతికే చూపు వేట ఏమిటో!! రగులు జ్వాల నీటివల్ల ఆరిపోతుంది గాని కన్నుల్లో అశ్రుకణం పెట్టు మంట ఏమిటో!! కొంటెగాలి దురుసుతనం గాలిపటం కంటెనా ఆధారపు దారం తెగ పెనుగులాట ఏమిటో!!

Read More
శ్రీ సిరా శ్రీ

చినుకులు పడుతుంటే చిరాకేల? తడవవోయ్

చినుకులు పడుతుంటే చిరాకేల? తడవవోయ్ పదుగురు తోడుంటే పరాకేల? నడవవోయ్ ప్రతి నిమిషం నీలోనే తుళ్ళిపడే తపనుంటే మోయలేని బరువులు మనసుకేల? విడువవోయ్ వెలలేని చెలిమి సిరులు నీకోసం వేచుంటే రెప్పచాటు చెమ్మలు కనులకేల? తుడవవోయ్ నిప్పులాంటి సంకల్పం నిజమై వెలగాలంటే నీరసం, నిస్తేజం తనువుకేల? వదలవోయ్ గజలు గాలి సిరాశ్రీ! నిను తాకిందంటే కాగితాల లెక్కంతో కలముకేల? కదపవోయ్

Read More