August 3, 2026
డా. గజల్ శ్రీనివాస్ ,వ్యవస్థాపకులు.

మిత్రులారా,

గజల్ సాహితీ ప్రక్రియ శతాబ్దాలుగా సాహితీ ప్రియులను అలరిస్తోంది. పార్శీ నుండి ఎన్నో భాషలలోకి ప్రవహించి తన ఉనికిని చాటుకున్న జనరంజక ప్రక్రియ. డా.దాశరథి, డా. సి. నారాయణరెడ్డి వంటి కవుల యొక్క విశేష కృషి వలన, డా. గజల్ శ్రీనివాస్ వైవిధ్య భరితమైన తెలుగు గజల్ గాన పటిమ వల్ల తెలుగు గజల్ కు ప్రజల హృదయాలలో విశ్వ వ్యాప్తంగా స్థానం లభించింది. ప్రచారం జరిగింది. 
2005 లో డా.గజల్ శ్రీనివాస్ గజల్ చారిటబుల్ ట్రస్ట్  స్థాపించి గజల్ రచనా,గాన సదస్సులు దేశ వ్యాప్తంగా నిర్వహించి అనేక మంది క్రొత్త గజల్ కవులకు అవగాహన కలిగించి ప్రోత్సహించారు. ఈ ప్రయత్నం వల్ల  వందలలో  గజల్ కవులు పుట్టుకొచ్చారు.అందులో కొంతమంది వేల సంఖ్యల్లో తెలుగులో గజళ్లు వ్రాస్తున్నారు, గ్రంధాలు విడుదల చేసారు.
 
ఫేస్ బుక్ , వాట్సాప్ మాధ్యమాల ద్వారా కొన్ని గజల్ గ్రూప్స్ ఏర్పడి నవతరానికి స్పూర్తి కలిగిస్తున్నారు.
 
డా. రెంటాల శ్రీ వెంకటేశ్వర రావు,
 డా. తటవర్తి రాజ గోప బాలం , శ్రీ వెంపరాల సుబ్రహ్మణ్యం మొదలగు కవులు తెలుగు గజల్ రచనలో విశేష కృషి చేసి తెలుగు గజల్ కు ప్రాచుర్యం తెచ్చారు.
తెలుగు గజల్  వెబ్సైట్ 2000 లో ఆవిష్కృతమైంది.  ఇపుడు పూర్తి స్థాయిలో ప్రతి  తెలుగు  గజల్ కు ఒక వేదిక అవసరమని భావించి  Rekhata స్పూర్తి తో తెలుగు గజల్  వెబ్సైట్ ను ఆధునీకరించి అందరి కవుల గజళ్ళ ను ఒకే గొడుగు క్రిందకు తీసుకు వచ్చే ప్రయత్నం ఇది.  ఈ అవకాశాన్ని మనం అందరమూ ఉపయోగించుకొని తెలుగు గజల్ వికాసానికి కృషి చేద్దాము.
 
మీ
డా. గజల్ శ్రీనివాస్ 
వ్యవస్థాపకులు.